మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతిపై నర్సంపేట డిపోలో సంతాపం.. నిరసన

Date: 2026-11-04
news-banner

అందరి టీవీ డిజిటల్ న్యూస్:నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మణుగూరు డిపోలో మహిళా కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న     ప్రవళిక అకాల మరణం పట్ల నర్సంపేట డిపో మేనేజర్ సరస్వతి తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి ఆర్టీసీ సంస్థకు, ఆమె కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నర్సంపేట డిపో ఉద్యోగులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ప్రవళికకు ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఈ ఘటనకు బాధ్యురాలైన ప్రయాణికురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టి, ప్రభుత్వంతో పాటు సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు రక్షణతో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

ఈ మేరకు నర్సంపేట డిపో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నర్సింహులు ఆధ్వర్యంలో డిపో ప్రధాన గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిపో జేఏసీ నాయకులు బండి బాబు, పి.ఎన్.రావు, వేముల రవి, అప్సర్ అలీ, ఏడీసీ రఘువీర్ తదితరులతో పాటు డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి.. విధి నిర్వహణలో భద్రత కల్పించాలి అంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.                                                                       మరిన్ని తాజా తెలంగాణ జిల్లా వార్తల కోసం అందరి టీవీ డిజిటల్ న్యూస్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.

Leave Your Comments